Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ మధ్యకాలంలో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బ్లాస్ట్ జోన్’తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ‘కన్నప్ప’ సమయంలోనే ఆమెకు మంచి రికగ్నిషన్ లభించింది, కానీ ‘బ్లాస్ట్ జోన్’ తర్వాత మాత్రం కుర్రకారు అందరికీ ఆమె ఒక కలల యువరాణిగా మారిపోయింది. ఇక సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తాజాగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అంటూ అతని క్వాలిటీస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఒక రిలేషన్షిప్లో తాను అన్నిటికంటే ఎక్కువగా ‘ఎంపతీ’ (Empathy) అనే క్వాలిటీని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. అంటే తోటి వారి భావాలను అర్థం చేసుకునే మనసున్న వారిని తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ తన ఎమోషన్స్, తన ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ రిలేషన్ బలంగా ఉంటుందని తాను నమ్ముతానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె హీరోయిన్గా నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘ఇదయం మురళి’, తెలుగులో ‘హృదయం మురళి’గా రిలీజ్ అయింది. సినిమా కంటెంట్ బాగున్నా కూడా ఎందుకో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రస్తుతం అటు తమిళంతో పాటు తెలుగు మీద కూడా ఫోకస్ చేసి, వరుస సినిమాలు చేసేందుకు ఈ భామ ప్లాన్ చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!