పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య అశాన్య.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని కాన్పూర్‌లో కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలిని మోడీ ఓదార్చారు. మీ బాధలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు మోడీ అన్నారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి బాధితుల్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అప్పటి వరకు ప్రకృతిని, కాశ్మీర్ అందాలను చూస్తూ సంతోషంగా ఉన్న వారిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. క్షణాల్లో వారి ఆనందాన్ని విషాదంగా మార్చారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడికి తెగబడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 26 మంది మరణించారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరైంది. వణుకుతున్న స్వరంతో "సార్.. మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం.' అన్నారు.