PM Modi: 2 దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగింది.. ఇది దేశానికే గర్వకారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు. గుజరాత్లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Karnataka: నా కారునే ఆపుతావా?.. రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కూతురు
ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్సారి, వల్సాద్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ 8ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధిపై ఎవరూ దృష్టిసారించలేదంటూ ప్రధాని విమర్శలు గుప్పించారు. విమర్శించారు.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!