గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్‌లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే…