పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీలకు కీలక పిలుపునిచ్చారు. ‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు. సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. ఓటమి నిరాశకు యుద్ధభూమి కాదని.. మనం సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి పరుగులు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో మంచి చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. ఎన్డీఏ కూటమి 202 సీట్లు సాధించింది. విపక్ష కూటమి దారుణంగా చతికిలపడింది. అధికారంలోకి వద్దామనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మరోసారి పోరాటానికి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి కూడా ఓటర్ ప్రత్యేక సర్వేపై గళమెత్తాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదని.. పరాజయాన్ని కూడా అంగీకరించే మనసు కూడా ఉండాలని విపక్షాలకు మోడీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి.
Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz
— Narendra Modi (@narendramodi) December 1, 2025