Kerala Bandh: కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ.. పలు జిల్లాల్లో రాళ్లదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
ఈ అరెస్టులపై పీఎఫ్ఐ పాటు కొంతమంది ముస్లింలు ఈ దాడులను ఖండించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో అరెస్టులకు వ్యతిరేకంగా గురువారం ఆందోళనలు నిర్వహించారు. అరెస్టులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ శుక్రవారం కేరళ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ సంస్థకు చెందిన అగ్రనేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన కార్యక్రమాలు, హర్తాళ్ చేపట్టారు. గురువారం ఎన్ఐఏ జరిపిన దాడుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన 22 మంది ఫీఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల హర్తాళ్ ఉద్రిక్తతలను పెంచింది. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, వాయనాడ్, అలప్పుజా జిల్లాల్లో ప్రభుత్వ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఇద్దరు సివిల్ పోలీసు అధికారులను పిఎఫ్‌ఐ ఆందోళనకారులు కిందకు నెట్టారు.
Also Read
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
REad ALSO: Bus Accident in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
పీఎఫ్ఐ బంద్ నేపథ్యంలో అప్రమత్తం అయిన కేరళ రాష్ట్రపోలీసులు అన్ని జిల్లాల్లో కూడా భారీగా భద్రతను పెంచారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ యథావిధిగా నడుస్తుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పీఎఫ్ఐ నిరసనలకు పిలునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో భద్రతను పెంచారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ఐఏ పని చేస్తుందని పీఎఫ్ఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిన్న అరెస్ట్ అయిన వారిలో పీఎఫ్ఐ జాతీయ చైర్మన్ ఓఎంఏ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన ఎలమరం, కేరళ అధ్యక్షుడు సీపీ మహ్మద్ బషీర్ ఉన్నారు.
Kochi, Kerala | A KSRTC bus was vandalised allegedly by people supporting the one-day bandh called by PFI today, in Companypadi near Aluva pic.twitter.com/XZqhiAxTDL
— ANI (@ANI) September 23, 2022
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..