Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం
- ఇంధన శాఖతో ఆయిల్ సంస్థలు చర్చలు!
- ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం ఇస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్‌ను ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ భారత పౌరులకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు.
మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. పెట్రోల్, డీజిల్, గ్యా్స్ ధరలు పెరగబోతున్నాయని బలుబు వెలిగిపోయింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆయిల్ సంస్థలకు రోజుకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దీంతో ధరలు పెంచాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. మంత్రిత్వ శాఖల మధ్య చర్చల నేపథ్యంలో ఇంధన ధరల పెంపు భారీగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపుపై ఆలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ త్రైమాసికంలో ఆయిల్ కంపెనీల అండర్ రికవరీలు రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని.. అందులో సుమారు రూ.1 లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేసింది.
సోమవారం సాయంత్రానికల్లా చమురు ధరలు పెరగవచ్చని వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పెంపు సమయం.. ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని వర్గాలు తెలిపాయి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురు, గ్యాస్, ఎల్‌పీజీలను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వినియోగదారులను ఆదుకునేందుకు తుది ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముతున్నాయని.. దీనివల్ల రోజుకు రూ. 1,000 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. పెరుగుతున్న నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!