Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
- భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
- భారత CEC జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యలను ట్రంప్ పోస్ట్..
- అమెరికాలో SAVE Act ఆమోదానికి ఉదాహరణగా భారత ఎన్నికల విధానం..
- ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సెటైర్లు..
- “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి” అని ఖేరా వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. అమెరికాలో సేవ్ యాక్ట్‌ను ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారత ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన్ SIR ప్రక్రియపై ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై ట్రంప్ ప్రశంసలు కాంగ్రెస్‌లో ఆగ్రహాన్ని పెంచాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా మంగళవారం ట్రంప్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) కూడా పంపిస్తామని వ్యాఖ్యానించారు. ‘‘ ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, దయచేసి జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి. ఆయనను అక్కడే ఉంచుకోండి. మా EVMలను కూడా తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో పంపిస్తాం’’ అని కామెంట్స్ చేశారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా అమెరికాలో SAVE Actను ఆమోదించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల విధానం, ఓటర్ల గుర్తింపు అవసరాలను ప్రస్తావించారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అమెరికా ఎన్నికల వ్యవస్థపై మాట్లాడినట్లు ట్రంప్ ప్రస్తావించారు. ‘చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని జ్ఞానేశ్ కుమార్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని ప్రస్తావిస్తూ.. దాదాపుగా 64.4 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని, ఒక శాతానికి కన్నా తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, ప్రతీ ఓటర్ కూడా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని కలిగి ఉన్నారని చెప్పారు.
మరోవైపు, అమెరికాలో సేవ్ యాక్ట్‌ను వెంటనే ఆమోదించాలని ట్రంప్ మరోసారి కాంగ్రెస్‌ను కోరారు. ఈ చట్టం ద్వారా ఫెడరల్ ఎన్నికల్లో కేవలం అమెరికా పౌరులు మాత్రమే ఓటే వేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓటు నమోదు చేసుకునే సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో పాటు పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. “అమెరికా ఎన్నికలను అమెరికన్ పౌరులు మాత్రమే నిర్ణయించాలి” అని వైట్‌హౌస్ పేర్కొంది.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?