Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- ఎలుకలను తరిమిన బాల్యం నుంచి రష్యా అధినేతగా..
- పుతిన్ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు..
- గూఢచారి నుంచి దేశాధ్యక్షుడిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుపై యావత్ ప్రపంచం దృష్టిసారించింది. 11 సభ్యదేశాధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాధినేతలు ఢిల్లీకి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా భారత్ వస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు పుతిన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది. కేజీబీ గూఢచారి నుంచి రష్యా అధ్యక్షుగా పుతిన్ ఎదిగిన తీరువెనక ఎంతో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
బాల్యంలో అనేక సమస్యలు..
పుతిన్ బాల్యం అంత సులువుగా సాగలేదు. 1952 అక్టోబర్ 7న అప్పటి లెనిన్గ్రాడ్లో, ప్రస్తుత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. పుతిన్ కుటుంబం ఒక సామూహిక అపార్ట్మెంట్లో నివసించేది. ఈ ఒక్క భవనంలోనే అనేక కుటుంబాలు కలిసి ఉండేవి. తన ఆత్మకథ ‘‘ఫస్ట్ పర్సన్’’లో పుతిన్ తన చిన్నాటి ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. మెట్లపై ఎలుకల్ని తరిమేవాడినని, ఒకసారి ఒక పెద్ద ఎలుక తనపై ఎదురుదాడి చేసిందని గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఎవరినైనా అణిచివేసినప్పుడు వారు ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుందని అప్పుడే నేర్చుకున్నానని పుతిన్ చెప్పుకొచ్చారు.
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
జూడోలో బ్లాక్ బెల్ట్:
పుతిన్ చిన్నప్పటి నుంచి సాంబో, జూడో వంటి ఆత్మరక్షణ కళలపై ఆసక్తి ఉండేది. సుమారు 11-12 ఏళ్ల వయసులోనే వీటిని నేర్చుకోవడం ప్రారంభించారు. లెనిన్గ్రాడ్ లెవల్ పోటీల్లో విజయం సాధించి, జూడోలో బ్లాక్ బెల్ట్ పొందారు. జూడో కూడా తన వ్యక్తిత్వంపై ప్రభావం చూపిందని పుతిన్ చెప్పారు. పోరాటంలో ప్రత్యర్థి బలాన్ని అర్థం చేసుకుని సరైన సమయంలో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనేది జూడోలో కీలక అంశం.
16 ఏళ్ల వయసులో గూఢచారి కావాలనుకున్నారు.
పుతిన్‌కు గూఢచారి కథలు, సోవియట్ సినిమాలపై ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తితోనే 16 ఏళ్ల వయసులోనే సోవియట్ గూఢచారం సంస్థ కేజీబీ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలని అని అడిగారు. ఆ అధికారులు కేజీబీలో చేరాలంటే ముందుగా సైన్యంలో చేరాలని, ఆ తర్వాత యూనివర్సిటీలో లా చదవాలని సూచించారు.
న్యాయ శాస్త్రంలో డిగ్రీ.. కేజీబీలో శిక్షణ.. జర్మన్ భాషలో పట్టు..
1984-85 మధ్యకాలంలో పుతిన్ మాస్కోలోని కేజీబీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. అక్కడే విదేశీ గూఢచర్యానికి సంబంధించిన మెలుకువల్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత జర్మన్ భాషపై పట్టు సాధించారు. 1985లో తూర్పు జర్మనీలో కేజీబీ అధికారిగా నియమితులయ్యారు. తూర్పు జర్మనీ భద్రతా సంస్థ స్టాసీతో పనిచేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ మైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.
అధ్యక్షుడిగా ఎదిగిన పుతిన్..
1985-90 వరకు పుతిన్ తూర్పు జర్మనీలో కేజీబీ అధికారిగా పనిచేశారు. 1989లో జర్మనీ ఏకీకరణ, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఆయన జీవితం మరో దశకు చేరుకుంది. 1990లో లెనిన్ గ్రాడ్కు తిరిగి వచ్చని ఆయన అప్పటి నగర మేయర్ అనటోలీ సోబ్చక్తో కలిసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1996లో మాస్కోలో కేంద్ర ప్రభుత్వంలో వేగంగా ఎదిగారు. 1998లో ఎఫ్ఎస్బీ డైరెక్టర్‌గా, 1999లో రష్యా ప్రధానిగా, 1999 డిసెంబర్ 31న అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ రాజీనామా చేయడంతో పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2000లో ఆయన అధికారికంగా రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రష్యాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!