బాలీవుడ్ బాక్సాఫీస్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తూ నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి బయటకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ పఠాన్ మూవీకి 4.5 రేటింగ్స్ ఇచ్చాడు. షారుఖ్ సాలిడ్ గా బౌన్సు బ్యాక్ అయ్యాడు అంటూ పఠాన్ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటే… కొంతమంది మాత్రం థియేటర్స్ నుంచి లీక్స్ ఇస్తున్నారు. పఠాన్ మూవీలో ‘టైగర్’ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడు అనే విషయం ముందు నుంచీ అందరికీ తెలిసిందే అయినా ఏ టైంలో వస్తాడు? ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయాన్నే కొందరు లీక్ చేస్తూ ఏకంగా సల్మాన్ ఖాన్ ఫైట్ సీక్వెన్స్ నే లీక్ చేశారు. సల్మాన్-షారుఖ్ కలిసి ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కరులు కొడుతుంది.
పఠాన్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టైగర్ వచ్చి కాపాడుతాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15 నిమిషాల పాటు సల్మాన్ ఖాన్ క్యామియో ఉందని లీక్ చెయ్యడంతో, షారుఖ్ ఫాన్స్ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ లీక్ అయిన వీడియోలని డిలీట్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా క్లిప్స్ అయినా సోషల్ మీడియాలో లీక్ అయితే ఆ మూవీకి నష్టం కలుగుతుంది కానీ పఠాన్ సీన్స్ లీక్ అవ్వడం ఆ మూవీకి కలిసోచ్చేలా ఉంది. సల్మాన్ ఖాన్ ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయంలో క్లారిటీ లేక థియేటర్స్ కి దూరంగా సల్మాన్ ఖాన్ ఫాన్స్ ఇప్పుడు మంచి జోష్ లో పఠాన్ మూవీని చూడడానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. తన ట్రేడ్ మార్క్ థీమ్ తో టైగర్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ పదిహేను నిముషాలు తెరపై కనిపిస్తాడు అంటే ఏ సినీ అభిమాని సైలెంట్ గా ఉండడు. సో ఈ లీక్ పఠాన్ సినిమాకి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి.