Pahalgam Terror Attack: భారత్ దెబ్బకి భయపడిన పాక్.. ఉగ్రవాదుల తరలింపు..
- భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
- పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేస్తున్న పాకిస్తాన్ సైన్యం..
- ఉగ్రవాదులను షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించినట్లు సమాచారం. భారత భద్రతా దళాలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్‌లను గుర్తించడంతో పాక్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read Also: Ready to War: యుద్ధానికి సిద్ధమా..? ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవా..?
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కేల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, కొట్లి లాంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు కాశ్మీర్‌లోకి చొరబడటానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పని చేస్తాయని పేర్కొన్నారు. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఉన్నారని, వారంతా చొరబాటుకు రెడీగా ఉన్నారని వెల్లడించారు.
Read Also: Pahalgam Terror Attack: రోడ్లపై పాకిస్థాన్ జెండాలు అతికించిన వ్యక్తులు.. పోలీసులు ఏం చేశారంటే?
ఇక, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్ర దాడిలో26 మంది చనిపోయారు. ఈ సంఘటనతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలను ఇప్పటికే భారత్ రద్దు చేసుకుంది. అలాగే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు దాయాది దేశానికి చెందిన పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. మరోవైపు, సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన బెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..