Operation Sindoor: దాడులపై 30 నిమిషాల్లోనే పాకిస్తాన్‌కి సమాచారం అందింది: జైశంకర్..
- ఆపరేషన్ సిందూర్ గురించి కీలక విషయాలు వెల్లడించిన జైశంకర్..
- దాడులు ప్రారంభమైన 30 నిమిషాల్లోనే పాక్‌కి సమాచారం ఇచ్చాం..
- ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు చెప్పాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. మొత్తం 09 లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారతదేశం ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత 30 నిమిషాల్లోనే పాకిస్తాన్ అప్రమత్తమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి తెలియజేసినట్లు తెలిసింది. మే 07 రాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
Also Read
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
‘‘ ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన అరగంటలోపు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చాం. భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆప్ మిలిటరీ ఆపరేషన్స్(DGMOలు) మధ్య ప్రత్యక్ష సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆపరేషన్ సిందూర్ మరియు పాకిస్తాన్ నుండి ఉద్భవించే సీమాంతర ఉగ్రవాదం గురించి చర్చించడానికి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించిన విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, ప్రియాంక చతుర్వేది, అప్రజిత సారంగి, గుర్జిత్ ఆజ్లా వంటి ఎంపీలు పాల్గొన్నారు. భారతదేశం ఖచ్చితత్వంతో వ్యవహరించిందని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండటానికి పాకిస్తాన్‌కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసిందని జైశంకర్ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి నిఘా వర్గాలకు సమాచారం అందించినప్పుడు భారత్ తీవ్రంగా స్పందించిందని జైశంకర్ చెప్పారు.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?