Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Eyes Sachin Tendulkar’s Rare Records: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరలా రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఈరోజు తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న కింగ్.. ఒకేసారి నాలుగు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేయనున్నాడు. ఆ రేర్ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.
మరో 59 పరుగులు:
వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ జట్టుపై ఇప్పటివరకు 43 మ్యాచ్‌ల్లో 41 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 66.50 సగటుతో 2,261 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ఉన్న విరాట్.. ప్రస్తుతం 14,941 పరుగులతో ఉన్నాడు. మరో 59 పరుగులు చేస్తే 15,000 వన్డే పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా, మొత్తంగా ఈ మార్క్‌ను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ చేరనున్నాడు.
Also Read
- Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ 'మహమ్మద్ షమీ'..!
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
- India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
తిరువనంతపురంలో అద్భుత రికార్డు:
అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల మైలురాయిపై కూడా విరాట్ కోహ్లీ కన్నేశాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కలిపి 85 సెంచరీలు చేసిన కోహ్లీ.. 100 శతకాల మార్కుకు ఇంకా 15 సెంచరీల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై ఇప్పటికే 41 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు చేసిన నేపథ్యంలో ఈ సిరీస్‌లో మరో శతకం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరువనంతపురంలో కూడా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డేలు ఆడిన విరాట్.. 199 పరుగులు చేసి ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. 2023 జనవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లీ.. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత వేగం పెంచి కేవలం 25 బంతుల్లో మరో 66 పరుగులు సాధించాడు.
మరో రెండు శతకాలు:
ఇక లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సెంచరీల విషయంలోనూ విరాట్ కోహ్లీ మరో అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 59 లిస్ట్-ఏ శతకాలతో ఉన్న కోహ్లీ.. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 60 లిస్ట్-ఏ సెంచరీల రికార్డును అధిగమిస్తాడు. సొంత గడ్డపై అంతర్జాతీయ సెంచరీల విషయంలోనూ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 41 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్.. మరో రెండు శతకాలు చేస్తే సచిన్ పేరిట ఉన్న 42 హోమ్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టనున్నాడు.
మరో 110 పరుగులు:
భారత్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ రికార్డు పైనా విరాట్ కన్నేశాడు. సొంత గడ్డపై సచిన్ 164 మ్యాచ్‌ల్లో 6,976 వన్డే పరుగులు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ 130 మ్యాచ్‌ల్లో 6,867 పరుగులతో ఉన్నాడు. అంటే మరో 110 పరుగులు చేస్తే సచిన్ రికార్డును విరాట్ అధిగమిస్తాడు. ఇందులో కింగ్ సగటు 62.42 కాగా.. 27 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి.
మంచి ఫామ్‌లో కింగ్:
ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2026లో ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లో 64.00 సగటుతో 384 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 106కు పైగా ఉండగా.. ఒక సెంచరీతో పాటు మూడు అర్ధసెంచరీలు సాధించాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తే.. ఒకేసారి పలు రికార్డులు అతని ఖాతాలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ నాలుగు కీలక రికార్డులపై కోహ్లీ కన్నేయడంతో తొలి వన్డేపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
-
AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?