Rajinikanth: చెన్నైలో వరద బీభత్సం ఏ రేంజ్ లో సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిచౌంగ్ తుఫాను వలన చెన్నై మొత్తం అతలాకుతలం అయిపోయింది. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విష్ణు విశాల్ తో పాటు అమీర్ ఖాన్ కూడా ఈ తుఫాన్ లో చిక్కుకుపోవడం భయాందోళనలకు గురిచేసింది. ఇక ఇప్పటికే చాలామంది ప్రజలు ఈ తుఫాన్ వలన నిరాశ్రయులు అయ్యారు. తిండిలేక ఎంతోమంది నడిరోడ్డుమీదకు వచ్చేశారు. ఇక ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. సెలబ్రిటీలు సైతం తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు.
ఇక ఈ వరద ప్రభావం పోయిస్ గార్డెన్ పై కూడా పడింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబం పోయిస్ గార్డెన్ లోనే నివాసముంటుంది అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక ఈ వరదకు ఈ నివాసం కూడా మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రజినీ ఇల్లు పాదాలు లోతు వరద నీటిలో మునిగి కనిపిస్తుంది. ఇకపోతే రజినీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. లాల్ సలామ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి ఈ సినిమాలతో రజినీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
Poes Garden in and around #Thalaivar house . #CycloneMichuang | #ChennaiFloods | #Chennai | #ChennaiRainsHelp23 | #ChennaiFloods2023 | #Rajinikanth | #SuperstarRajinikanth | #superstar @rajinikanth pic.twitter.com/b88c5CqDgZ
— Suresh balaji (@surbalutwt) December 6, 2023