Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 18 ఎయిర్‌పోర్టులు మూసివేత, 200 విమానాలు రద్దు..

Nagpur Kolkata Indigo Flight

Nagpur Kolkata Indigo Flight

Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సిందూర్ ’’ పేరుతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఉగ్రస్థావరాలను భారత సైన్యం నెలమట్టం చేసింది. ఈ దాడుల్లో 80 వరకు ఉగ్రవాదుల మరణించినట్లుగా తెలుస్తోంది. నిజమైన సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని సమాచారం. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి.

Read Also: Chiranjeevi : ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’ మూవీ కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారో తెలుసా..

ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ దేశీయ విమానాలపై పడింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైజ్ జెట్ వంటి విమానయాన సంస్థలు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లోని విమానాశ్రయాలకు విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. మొత్తం 18 ఎయిర్‌పోర్టులు మూసేశారు. దాదాపుగా 200 విమానాలు రద్దు చేశారు. శ్రీనగర్, లేహ్, అమృత్‌సర్, చండీగఢ్ ఎయిర్ పోర్టులు మూతపడ్డాయి. వీటితో పాటు పఠాన్ కోట్, జోధ్‌పూర్, జైసల్మెర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్ సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని విమాన కార్యకలాపాలు నిలిపేశారు. ఇండిగో ఒక్కటే దాదాపుగా 165 సర్వీసుల్ని రద్దు చేసింది.

Exit mobile version