Tillu Square:సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డీజే టిల్లు తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు.. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను ప్రకటించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. టికెట్ యే కొనకుండా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.డీజే టిల్లు లో రాధికతో పులిహోర ఎలా కలిపాడో.. ఇక్కడ అనుపమతో మరోసారి టిల్లు పులిహోర కలపడం మొదలుపెట్టాడు. షూ తుడుస్తూ.. అనుపమను ఫ్లర్ట్ చేస్తూ కనిపించాడు.
Pawan Kalyan: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు
బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అనుపమకు అడగడం.. అనుపమ.. నీకెందుకు అని అడగడం.. ఏం లేదు.. ఉంటే షూ వేసుకొని వెళ్ళిపోతా.. లేకపోతే నిన్ను వేసుకొని వెళ్ళిపోతా అని టిల్లు స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక టిల్లు ఫ్రెండ్ థోఫిక్.. పోయినసారి అంత అయినా కూడా సిగ్గు రాలే టిల్లు అన్నకు అని చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ సాంగ్ ను జూలై 26 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రామ్ మిరియాల ఈ సాంగ్ ను ఆలపించాడు. ఇక ఫెంటాస్టిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పడంతో.. సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అనుపమ బోల్డ్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఎదపై టాటూ.. వైట్ డ్రెస్ లో ముద్దుగుమ్మ పిచ్చెక్కిస్తోంది. మరి రాధికలా ఈ చిన్నది పేరు తెచ్చుకుంటుందా.. ? లేదా ..? అనేది చూడాలి.