Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
- భారత్ దాడులు చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పరిస్థితి..
- కీలక విషయం చెప్పిన పాక్ మాజీ వైమానిక దళ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. పాకిస్తాన్ లోని బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు, మురిడ్కే లోని లష్కరే తోయిబా స్థావరాలను, పీఓకేలోని ఇతర ఉగ్రవాద స్థావరాలనను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదే కాకుండా పాక్ సైన్యం కవ్వింపులకు ధీటుగా బదులిచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన పలు ఎయిర్ బేసుల్ని క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేసింది.
అయితే, ఇన్నాళ్లు తమకేం నష్టం జరగలేదని చెబుతూ వస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు మాత్రం నిజాలను ఒప్పుకుంటోంది.పాకిస్తాన్ ఎయిర్ కమోడోర్(రిటైర్డ్) మాజీ పాకిస్తాన్ వైమానిక దళ అధికారి, రక్షణ విశ్లేషకుడు ఖలీద్ చిస్తీ, జీఎన్ఎన్ స్టూడియో పాక్కాస్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత పరిస్థితి ఎలా ఉందో వివరించారు.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
Read Also: Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
భారత్ వరసగా మూడు రోజులు డ్రోన్ దాడులు చేసిందని, ఆరు పాకిస్తానీ వైమానిక స్థావరాలకు స్వల్ప నష్టం కలిగిందని చిస్తీ అన్నారు. ఈ ఎపిసోడ్‌ను పాకిస్తాన్ సైనిక సంసిద్ధత, ప్రతిస్పందనకు మలుపుగా అభివర్ణించారు. ‘‘పాకిస్తాన్‌కు ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యం లేదు, సామర్థ్యం ఉంటే ధైర్యం లేదు. మొత్తం సైన్యం ఆపరేషన్ గదిలో నమాజ్ చేసింది’’ అని ఆయన అన్నారు.
మే 7, 2025న ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత బ్రహ్మోస్ క్షిపణులు రావల్పిండిలోని పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌తో సహా 10కి పైగా ఎయిర్‌బేసుల్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ను కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత, పాక్‌కు బుద్ధి చెప్పింది. మరోసారి ఉగ్రవాద దాడి జరిగితే, ఇలాంటి ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!