Site icon NTV Telugu

Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..

Pakis

Pakis

Operation Sindoor: భారత్ పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భీకర దాడి చేసింది. ఇదే కాకుండా షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్ బేస్‌పై భారీ దాడులు చేసింది. రావల్పిండితో పాటు ఇస్లామాబాద్‌లో కూడా పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆర్మీకి గుండె లాంటి రావల్పిండినే భారత్ కొట్టింది. రావల్పిండి లోనే రెండు భారీ దాడులు జరిగాయి. అయితే, దీనికి ప్రతీకారం ఉంటుందని పాక్ ఆర్మీ చెప్పింది. దాడిని ధ్రువీకరించింది.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..

మరోవైపు, లాహోర్, సియాల్ కోట్‌లో కూడా భారీ ఎత్తున దాడులు జరిగాయి. లాహోర్‌లోని పాక్ ఆర్మీ డివిజన్‌ని టార్గెట్ చేసింది. ఆర్మీ డివిజన్ నుంచి వాహనాలు బయటకు వెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. ‘‘నోటమ్’’ జారీ చేసింది. మద్యాహ్నం 12 గంటల వరకు దేశ, విదేశ విమానాలకు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. అబుదాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాన్ని క్వెట్టాకు మళ్లించినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన దాడుల్లో ఎయిర్ బేస్‌లోెని అన్ని సౌకర్యాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాక్ ఫైటర్ జెట్స్ ఎగరకుండా చేసినట్లు సమాచారం.

Exit mobile version