Site icon NTV Telugu

Operation Sindoor: మ్యాప్ మారుతుంది.. పాకిస్తాన్‌కు ముగ్గురి వార్నింగ్..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పాకిస్తాన్‌కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారతీయ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి లేదా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే, ఆపరేషన్ సిందూర్ 2.0ను చూస్తారని హెచ్చరించారు. పుల్వామా లాంటి ఘటనలు జరిగితే ఆపరేషన్ సిందూర్ 2.0 జరగొచ్చు, దీనిలో పాకిస్తాన్ తన సైనిక స్థావరాలతో పాటు, భూభాగాన్ని కూడా కొల్పోతుంది అని అన్నారు.

Read Also: Russia: పాకిస్తాన్‌కు రష్యా ఇంజన్లు.. నిజం ఏంటంటే..

ఈ హెచ్చరికలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రపంచదేశాల పర్యటనలో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చాయి. ‘‘పాకిస్తాన్ సర్ క్రీక్ పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, సమాధానం చాలా బలంగా ఉంటుంది. అది పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మారుస్తుంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతసైన్యం 1965 యుద్ధంలో లాహోర్ ను చేరుకుందని, ఇప్పుడు కరాచీపై దాడి జరుగుతుందని అన్నారు.

దీని తర్వాత, అక్టోబర్ 3న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ఈసారి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో ఉన్నట్లు సంయమనంతో ఉండబోమని చెప్పింది. భారత్ ఈ సారి పూర్తిగా సిద్ధంగా ఉందని, ఇది పాకిస్తాన్ మ్యాప్‌ను మారుస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని హెచ్చరించారు. అదే రోజు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను, దాదాపు 12 పాకిస్తాన్ విమానాలు, కమాండ్ పోస్టులు, ఎయిర్ ఫీల్డ్‌లు, రాడార్ సైట్లను కోల్పో్యిందని చెప్పారు.

Exit mobile version