దేశ భద్రతను, సంపదను రక్షించేందుకు భారత రక్షణ దళాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అధునాతన ఆయుదాలను త్రివిధ దళాలు సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహే యుద్ధనౌకను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మహే శ్రేణిలో ఇది మొదటిది. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు. ఈ నౌక శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది.…
Operation Sindoor: పాకిస్తాన్‌కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్‌లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.