Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy On Chandrababu Naidu Political Alliances: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలయికపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పందించారు. అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. చంద్రబాబు చేస్తోంది మోసమని ఆరోపించారు. పొత్తుల విషయంలో తమకు స్పష్టమైన విధానం ఉందని.. కూటములు, పొత్తులకు సిద్ధాంతాలు ఉండాలని అన్నారు. 2014లో జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాయని.. తర్వాత అదే చంద్రబాబు వాళ్లపై ఆరోపణలు వేసి, బయటకు వచ్చాడని వ్యాఖ్యానించారు.
Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. జగన్‌కు ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లతో పాటు ఓట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేసింది. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని తేల్చి చెప్పారు. మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న విషయం.. అన్నీ సర్వేల్లోనూ తేలుతోందని చెప్పారు. తమకు చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఒంటరిగా పోటీ చేసి, గత ఎన్నికల్లో కంటే గొప్ప విజయాన్ని నమోదు చేస్తామని నమ్మకంగా చెప్పారు.
Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే
అంతకుముందు కూడా.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడని, టీడీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ పొగిడారని.. చంద్రబాబు తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని.. మరి ఇప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులే అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారం
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!