Iran-US: ‘హార్ముజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- హార్ముజ్ జలసంధిని తెరవం
- అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- షరతులు అంగీకరించాలని మెలిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తమపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ షరతులు నెరవేరిన తర్వాతే జలసంధిని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.
మంగళవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రసంగంలో గాలిబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న హామీలను అమెరికా అమలు చేసే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా మూడు కీలక చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు గతంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన జూన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినవని గాలిబాఫ్ తెలిపారు. అయితే ఆ ఒప్పందం అనంతరం పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.
Also Read
హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ
ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు ఇరాన్ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు ట్రాన్సిట్ సర్వీస్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని సమాచారం. అయితే అమెరికా, పలు ప్రాంతీయ దేశాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీంతో జలసంధిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు సంబంధించి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఈ జలసంధికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా నౌకల రాకపోకలకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుపుతున్నాయి. ప్రతిపాదిత నౌకా రవాణా మార్గానికి సంబంధించిన భౌగోళిక కోఆర్డినేట్లపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఇరాన్ తెలిపింది. సంయుక్త ప్రకటనకు సంబంధించిన అంశాలపై కూడా ఇరుదేశాలు అభిప్రాయాలను పంచుకుంటున్నట్లు వెల్లడించింది.
అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ గతంలో మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరితేనే జలసంధిని తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
ఒమన్‌పై ట్రంప్ హెచ్చరిక
హార్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇరాన్‌తో హార్ముజ్ అంశంపై అమెరికా కుదుర్చుకునే ఒప్పందానికి ఒమన్ అడ్డుపడితే ఆ దేశంపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ కూడా తమకు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఒమన్.. ఇరాన్‌తో నౌకా రవాణాపై దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!