SCO summit: కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..
- ప్రధానికి బదులుగా ఎస్‌సీఓ సమ్మిట్‌కి జైశంకర్..
- వచ్చే వారం కజకిస్తాన్‌లో సమావేశం..
- రష్యా పర్యటన వల్లే సమావేశాన్ని దాటవేస్తున్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO summit: వచ్చే వారం కజకిస్తాన్ ఆస్తానాలో జరగబోయే ‘‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)’’ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈ సమావేశాన్ని దాటవేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ జూలై 08,09 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా పర్యటన తర్వాత రెండు రోజుల పర్యటన కోసం జూలై 09న ఆస్ట్రియా వెళ్లే అవకాశం ఉంది.
Read Also: PM Modi: జూలై 8న ప్రధాని మోడీ రష్యా పర్యటన.. భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
రష్యా, ఆస్ట్రియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ఎస్‌సీఓ సమ్మిట్‌కి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. అయితే, మోడీ రెండు దేశాల పర్యటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. జూలై 3 మరియు 4 తేదీల్లో జరగనున్న SCO సమ్మిట్ ప్రాంతీయ భద్రతా పరిస్థితి మరియు కనెక్టివిటీ మరియు వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు.
విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, SCO సమ్మిట్‌లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచడంపై ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చ జరగబోతోంది. మంగళవారం ప్రధాని మోడీ కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ, సమ్మిట్ విజయవంతానికి భారత్ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కజకిస్తాన్ అధ్యక్ష హోదాలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!