Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
- ఫ్రీ లెఫ్ట్‌లోనే ట్రాఫిక్ చిక్కులు
- లేన్ క్రమశిక్షణ ఎక్కడ?
- అధికారుల చర్యలు తప్పనిసరి
- ప్రజల బాధ్యతే కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఈ ఇబ్బందులకు కేవలం రోడ్ల విస్తీర్ణం ఒక్కటే కారణం కాదు; వాహనదారుల క్రమశిక్షణా రాహిత్యం, ముఖ్యంగా జంక్షన్లలో ఉండే ‘ఫ్రీ లెఫ్ట్’ (Free Left) మార్గాలను అడ్డగోలుగా ఆక్రమించడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
ఫ్రీ లెఫ్ట్ ఆక్రమణ.. గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు
నగరంలో ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ఎడమ వైపు మలుపు తిరిగే వాహనాలు ఆగకుండా సులభంగా వెళ్లేందుకు ‘ఫ్రీ లెఫ్ట్’ మార్గాలను కేటాయిస్తారు. కానీ, నేరుగా వెళ్లాల్సిన లేదా కుడి వైపు తిరగాల్సిన వాహనదారులు ఎడమ వైపు లేన్‌లో తమ వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల నిజంగా ఎడమ వైపు వెళ్లాల్సిన వాహనదారులకు దారి లేక, వెనుక పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
- Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
- Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
- BRS Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు.. కేటీఆర్ కీలక పోస్ట్..
బాధ్యతారాహిత్యం.. క్షేత్రస్థాయి అమలు లోపం
ట్రాఫిక్ క్రమశిక్షణ లోపించడం, “నా ఒక్క వాహనమే కదా” అని ఆలోచించి లేన్ క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోతోంది. మరోవైపు, ఈ విస్మరణను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సిబ్బంది వైఫల్యం ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను దిగ్బంధించే వారిపై కఠిన చర్యలు, చలాన్లు విధించకపోవడం వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చుతోందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
సమస్య పరిష్కారానికి కావాల్సిన చర్యలు
నగరంలో ట్రాఫిక్ ప్రవాహం సజావుగా సాగాలంటే అధికారులు తక్షణమే కొన్ని కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ లేన్లను వేరు చేసేలా శాశ్వత బ్యారికేడ్లు, దూరానికే కనిపించే పెద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రోడ్డు నిర్మాణం వల్ల ఎడమ వైపు మలుపు వీలుకాని చోట్ల అయోమయం లేకుండా ‘నో ఫ్రీ లెఫ్ట్’ అని ముందే స్పష్టంగా బోర్డులు పెట్టాలి. సీసీ కెమెరాల ద్వారా లేన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించడంతో పాటు, మైకుల ద్వారా ఆక్రమణదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
ప్రజల్లో చైతన్యమే శాశ్వత పరిష్కారం
కేవలం బోర్డులు పెట్టడం, జరిమానాలు విధించడం వల్లే మార్పు రాదు. తమ స్వార్థం కోసం ఫ్రీ లెఫ్ట్ దారిని ఆక్రమిస్తే వెనుక వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారనే కనీస ఆలోచన ప్రతి వాహనదారుడిలో రావాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు తమకు కేటాయించిన లేన్లలోనే ప్రయాణించడం, ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని ఖాళీగా ఉంచడం పౌర బాధ్యతగా గుర్తించినప్పుడే హైదరాబాద్ రహదారులపై ట్రాఫిక్ కష్టాలకు తెరపడుతుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
-
OTR: పనితీరు బాగుంటేనే టికెట్.. రెండోసారి గెలుపు కోసం రేవంత్ కసరత్తు..!
-
Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్… వైరల్ అవుతున్న చెక్!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!