PM Modi: “సుప్రీంకోర్టుకు వెళ్లినా వారు బెయిల్ పొందలేరు”.. ఇండియా కూటమిపై ప్రధాని ఫైర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేదకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా మోడీ పూర్తి శక్తితో పోరాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండి కూటమి’ని ఏర్పాటు చేశారని, వారు మోడీని భయపెడదామని భావిస్తున్నారు, కానీ నేను నా భారతదేశం, నా కుటుంబాన్ని అవినీతిపరుల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటానని ప్రధాని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ప్రధాని నియంతృత్వ విధానాలను అవలంభిస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరించేందుకు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలో మహా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: INDIA Bloc: ఎన్నికల కమీషన్ ముందు ఇండియా కూటమి 5 డిమాండ్లు..
అవినీతికి వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవడంతో కొంతమంది విస్తుపోతున్నారని, నా దేశాన్ని అవినీతిపరుల నుంచి రక్షించడానికి నేను పెద్ద యుద్ధం చేస్తున్నాని పీఎం అన్నారు. అవినీతికి పాల్పడిన వారు కటకటాల వెనక ఉన్నారు, సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ పొందలేరు అని అన్నారు. అవినీతి నిర్మూలనకు ఎన్డీయే కట్టుబడి ఉందని, అవినీతి నేతల్ని రక్షించడానికి ఇండి కూటమి దృష్టిసారించిందని, అవినీతిని తొలగించాలా..? లేదా.. అని మీరే తేల్చుకోవాలని ప్రధాని మీరట్ సభలో అన్నారు. మోడీపై ఎంత దాడి చేసినా, ఎంత పెద్ద అవినీతిపరుడైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని, దోచుకున్న వాడు ఖచ్చితంగా దేశానికి తిరిగి ఇవ్వాలని ప్రధాని అన్నారు.
కచ్చతీవు ద్వీప వివాదాన్ని లేవనెత్తిన ప్రధాని మోడీ, దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదని, ‘విక్షిత్ భారత్’ని రూపొందించడానికి ఉద్దేశించినవని, రాబోయే 5 ఏళ్ల కోసం తమ ప్రభుత్వ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత 10 ఏళ్లలో మీరు అభివృద్ధికి సంబంధించి ట్రైలర్ మాత్రమే చూశారని, ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌తో పాటు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, ఇటీవల ఎన్డీయేలో చేరిన రాష్ట్రీ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ప్రధానితో వేదిక పంచుకున్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!