North Railways Slams Sonusood For Travelling Footboard: సోనూసూద్ ఒక మంచి నటుడే కాదు, రియల్ హీరో కూడా! కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లను ఆదుకొని, నిజ జీవితంలో రియల్ హీరోగా అవతరించాడు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వివాదాల జోలికి అస్సలు వెళ్లడు. అలాంటి సోనూసూద్‌పై నార్త్ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి తప్పుడు సందేశాలు ఇవ్వొద్దని హెచ్చరించింది కూడా! అంతలా సోనూసూద్ ఏం చేశాడనేగా మీ సందేహం? పదండి, మేటర్‌లోకి వెళ్లి ఆ వివరాలు తెలుసుకుందాం!
Sanju Samson: శ్రీలంక సిరీస్ నుంచి సంజూ ఔట్.. అదే అసలు కారణం
తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకునే సోనూసూద్.. లేటెస్ట్‌గా ఒక వీడియో షేర్ చేశాడు. అందులో అతడు నడుస్తున్న రైల్‌లో ఫుట్‌బోర్డు వద్ద కూర్చొని, బయటకు చూస్తూ కనిపించాడు. అంటే, అతడు ఆ జర్నీని ఫుట్‌బోర్డు వద్ద కూర్చొని ఆస్వాదించాడన్నమాట! అయితే.. ఇది సరైన చర్య ఏమాత్రం కాదు. ఫుట్‌బోర్డు వద్ద అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందరో అలాంటి ప్రయాణం చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే, ఈ ఫుట్‌బోర్డ్ జర్నీ విషయంలో నార్త్ రైల్వే సోనూసూద్‌పై ఆగ్రహించింది. ఇంకోసారి అలాంటి జర్నీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అయితే.. సీరియస్‌గా రియాక్ట్ అవ్వలేదులెండి, సున్నితంగానే సూచించింది.
Mekathoti Sucharitha: మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తా..
‘‘డియర్ సోనూసూద్.. ఒక్క మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నో మిలియన్ల జనాలకు మీరు ఒక రోల్ మోడల్. రైలు ఫుట్‌బోర్డు వద్ద కూర్చొని ప్రయాణించడం చాలా ప్రమాదకరమైనది. ఈ రకమైన వీడియోలు షేర్ చేస్తే.. అది మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపే అవకాశం ఉంది. కాబట్టి, దయచేసి ఇలా ఇంకోసారి చేయకండి. సాఫీగా, సురక్షితమైన ప్రయాణాన్ని ఆనందించండి’’ అంటూ నార్త్ రైల్వేస్ ట్వీట్ చేసింది. అలాగే.. ముంబై రైల్వే కమిషనర్ కూడా ఇది సోనూసూద్‌ని సూచించింది. సినిమాల్లో ఇలాంటివి ఎంటర్టైన్‌మెంట్‌లో భాగం కావొచ్చేమో గానీ, నిజ జీవితంలో కాదని, కాబట్టి, ఫుట్‌బోర్డ్ ప్రయాణాన్ని నిరోధించమని పేర్కొంది.
प्रिय, @SonuSood
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO
— Northern Railway (@RailwayNorthern) January 4, 2023