Sanju Samson Ruled Out Of Sri Lanka T20 Series Due To Injury: పాపం సంజూ శాంసన్.. ఇతనికి అదృష్టం షేక్ హ్యాంక్ ఇచ్చేలోపే, దురదృష్టం గట్టిగా హగ్ ఇచ్చేస్తోంది. తనకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి, ఆ వెంటనే చేజారిపోతున్నాయి. టన్నులకొద్దీ ట్యాలెంట్ ఉన్నప్పటికీ.. అది నిరూపించుకోవడం కోసం సంజూకి పెద్దగా ఛాన్సులు దక్కడం లేదు. అవకాశాలు వచ్చినప్పుడేమో.. ఏదో ఒక రకంగా విధి అతని నుంచి లాగేసుకుంటోంది. ఇప్పుడు శ్రీలంక సిరీస్ విషయంలోనూ అదే జరిగింది. రాకరాక చాలాకాలం తర్వాత టీమిండియాలో చోటు దక్కితే.. ఇంతలోనే అతడ్ని దురదృష్టం వెంటాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన సంజూ.. గాయం కారణంగా సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది.
Ram Gopal Varma: చంద్రబాబు నరహంతకుడు.. వర్మ సంచలన వ్యాఖ్యలు
సీనియర్లందరూ విరామం తీసుకోవడం, రంజీ ట్రోఫీలోనూ అర్థశతకాలతో సత్తా చాటడంతో.. శ్రీలంక టీ20 సిరీస్‌కు టీమిండియాలో సంజూ శాంసన్‌కి చోటు దక్కింది. ఎట్టకేలకు అతనికి ఛాన్స్ దక్కడంతో.. ఫ్యాన్స్ చాలా సంతోషించారు. ఈ సిరీస్‌లో అతడు సత్తా చాటి, జట్టులో తన స్థానాన్ని బలపరచుకుంటాడని భావించారు. కానీ.. తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన సంజూ, కేవలం 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న సంజూ, ఆ తర్వాతి బంతికే భారీ షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని గవాస్కర్ వంటి దిగ్గజాలు విమర్శించారు. సరే, హేమాహేమీలు సైతం ఇలాంటి తప్పులు చేసిన సందర్భాలున్నాయి కాబట్టి, మరో అవకాశంలో రాణిస్తాడని ఫ్యాన్స్ భావించారు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!
కానీ, ఇంతలోనే దురదృష్టం సంజూని వెంటాడింది. గాయం కారణంగా మొత్తం సిరీస్‌కే దూరమవ్వాల్సి వచ్చింది. ఒక బంతిని ఆపే సమయంలో.. సంజూ మోకాలికి దెబ్బ తగిలింది. దాన్ని పరీక్షించిన వైద్యులు, ఆ గాయం పెద్దదని తేల్చారు. అతడు కచ్ఛితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో చివరి రెండు టీ20 మ్యాచ్‌ల నుంచి సంజూని తప్పిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను ఎంపిక చేశారు. జితేశ్ భారత జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి.
SI Subhashree Case: లేడీ ఎస్సైని టార్గెట్ చేసి.. కత్తులతో వెంబడించి..