Lady Sub Inspector Subhashree Nayak Chased And Abused In Bhubaneswar: రానురాను మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుండగుల్లో మార్పు రావట్లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒక లేడీ ఎస్సైనే కత్తులతో బెదిరించారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును.. ఒక లేడీ ఎస్సైని కొందరు దుండగులు కత్తులతో వెంబడించారు. అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతూ, ఆమెని ఫాలో అయ్యారు. అయితే.. ఆ ఎస్సై తన తెలివితో వారి బారి నుంచి తప్పించుకుంది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Online Dating Fraud: వేశ్య కోసం వెతికాడు.. దోపిడీకి గురయ్యాడు
భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అయితే.. ఆమె రిజర్వ్ బ్యాంక్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, కొందరు దుండగులు ఆమెని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తనకి అనుమానం రావడంతో.. శుభశ్రీ తన వేగాన్ని మరింత పెంచింది. దుండగులు కూడా వేగం పెంచి, ఆమెని వెండబడించారు. కత్తులు, తల్వార్లతో బెదిరించారు. అంతేకాదు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడారు. ‘ఈరోజు మా చేతుల్లో అయిపోయావ్’ అంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే.. శుభశ్రీ వారి మాటలకు రెచ్చిపోకుండా, తెలివిగా వ్యవహరించింది. ఆ దుండగుల కళ్లు గప్పి, వారి బారి నుంచి తప్పించుకుంది.
Gun Fire: ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు తుపాకీతో కాల్పులు
అనంతరం ఈ ఘటనపై శుభశ్రీ భువనేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎస్‌ఐ శుభశ్రీ నాయక్‌కు డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో పలువురికి సహాయం చేశారు. పేదవారికి భోజనం అందించారు. ఆమె సేవలను గుర్తించి.. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు ప్రముఖులు శుభశ్రీని అభినందించారు.