Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని మార్కెట్ కు తీసుకువస్తారని అన్నారు.
Read Also: High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువధ, గోమాంసం రవాణా, విక్రయాలపై నియంత్రణ బిల్లును ఆమోదించిన తరుణంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ.. ఈశాన్య రాష్ట్రాల్లో హిందువులు నివసించే చోట బీఫ్ తినడాన్ని నిషేధించాలని కోరారు. అయితే బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయా పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసేవి రాజకీయ ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
దేశంలో తొమ్మిదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని.. దేశంలో ఏ చర్చిపై ఇప్పటి వరకు టార్గెటెడ్ దాడులు జరగలేదని, బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదని ఆయన ఎర్నెస్ట్ మావ్రీ అన్నారు. మేఘాలయ క్రైస్తవులు అధికంగా ఉండే రాష్ట్రమని, ప్రజలు ఎక్కువగా చర్చిలకు వెళతారని ఆయన గుర్తు చేశారు. గోవా, నాగాలాండ్ లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ఏ ఒక్క చర్చిని లక్ష్యంగా చేసుకోలేదని, కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు కావాలనే ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్దారు. నేను కూడా క్రిస్టియన్ నే, వారు నన్ను ఎప్పుడూ చర్చికి వెళ్లవద్దని చెప్పలేదని, మేఘాలయలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి.