ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిల్లాంగ్‌లో రోడ్‌షో నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమైన రోడ్‌షో పోలీసు బజార్‌లో ముగిసింది.
Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని…