Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్‌లో దాడి..
- భారతీయ వ్యక్తిపై బంగ్లాదేశ్‌లో దాడి..
- హిందువు మా దేశం ఎందుకు వచ్చావంటూ అటాక్..
- దాడి గురించి రిపోర్ట్ చేసినా పట్టించుకోని అధికారులు..
- భారతీయులు ఎవరూ ఆ దేశం వెళ్లొద్దని కోరిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు.
21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి ఐస్‌క్రీమ్ తింటుండగా, అక్కడికి చేరుకున్న గుంపు అతడి గుర్తింపు, దేశం, మతం అడిగి దాడికి పాల్పడ్డారు. తాను ఇండియాకు చెందిన వాడనిని హిందువు అని చెప్పడంతో దాడి మొదలైంది. మతోన్మాద మూక సయన్ని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి నా పర్సు, డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారని, కత్తితో రాళ్లతో దాడి చేశారు. తన స్నేహితుడిపై దాడిని అపేందుకు ప్రయత్నించిన ఆ దేశానికి చెందిన వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Syria Crisis: సంక్షోభం దిశగా సిరియా.. రష్యా ఆదుకునేనా.. రెబల్స్ దూకుడు..
‘‘ఒక భారతీయ హిందువు మా దేశానికి ఎందుకు వచ్చాడు..?’’ అని దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల జనాలు కూడా సాయం చేయలేదు. స్థానిక అధికారులు కూడా తనకు సాయం చేయలేదని ఘోష్ అన్నారు. తాను బంగ్లాదేశ్ ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేశానని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు బదులుగా తనపైనే ఆరోపణలు చేసినట్లు ఘోష్ చెప్పాడు. ఘటన జరిగిన తర్వాతి రోజు కొంతమంది స్థానికులు తన స్నేహితుడి ఇంటికి వచ్చి మరొసారి వచ్చి బెదిరించారని చెప్పాడు. భారతీయ హిందువులు ఎవరూ బంగ్లాదేశ్ వెళ్లొద్దని, సురక్షితం కాదని చెప్పాడు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ మైనారిటీలను ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మతోన్మాద మూక దాడులకు పాల్పడుతున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!