Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు. 21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్‌బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి…