Acharya Pramod: కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ బహిష్కరణ.. ‘‘రాముడి విషయంలో రాజీ లేదని రిఫ్లై‘‘
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acharya Pramod: కీలక కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణంని పార్టీ నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణారాహిత్యం ఆరోపణల కారణంగా అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై లక్నో నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆచార్య కృష్ణం ఇటీవలే అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన వేడుకపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినందుకు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు కూడా రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించలేదు, రాముడు లేకుండా భారతదేశాన్ని ఉహించలేమని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.
Read Also: Farmers Protest : రెండు వేల ట్రాక్టర్లపై 20వేల మంది రైతులు.. మోడీ ఇంటి ముట్టడికి ప్లాన్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే, ఆచార్య ప్రమోద్ తనను కాంగ్రెస్ బహిష్కరించడంపై ఎక్స్(ట్విట్టర్)వేదికగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. ‘‘రాముడు, దేశం విషయంలో రాజీ పడేది లేదు’’ అని రాశారు. పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ బహిష్కరణ తర్వాత అతను బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!