Nitish Kumar: నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్..
- నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం..
- పాట్నాలో అట్టహాసంగా ఎన్డీయే సర్కార్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు. బుధవారం ఎన్డీయే ఎమ్మెల్యేలు నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫారసు చేయడంతో, ఎన్డీయే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్‌ను ఎన్నుకున్నారు. దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు రాజీనామా సమర్పించి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్‌తో పాటు 18 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also: Alert In Sabarimala: అయ్యప్ప భక్తులకు హైఅలర్ట్.. శబరిమలలో భక్తుల రద్దీతో కేరళ సర్కార్ కీలక ఆదేశాలు..
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. 234 సీట్లకు గానూ బీజేపీ – జేడీయూల కూటమి ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, తరువాత జేడీయూ 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి (ఆర్వి) 19 సీట్లతో, హెచ్ఎఎమ్ ఐదు సీట్లతో, ఆర్ఎల్ఎం నాలుగు సీట్లతో సత్తా చాటాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ 25 సీట్లతో ఘోర పరాజయం పాలైంది.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!