Alert In Sabarimala: శబరిమలలో భారీగా పెరుగుతున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా.. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. 24వ తేదీ నవంబర్ 2025 వరకు – వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అయ్యప్ప దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి చేసింది కేరళ సర్కార్. ఇక, పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదని వెల్లడించింది. స్పాట్ బుకింగ్ కోటా రోజుకు 5 వేల కోటా పూర్తయితే బుకింగ్ ఉండదని తెలిపారు.
Read Also: Operation Sindoor: ‘‘రాఫెల్ జెట్స్’’ కూలాయని చైనా తప్పుడు ప్రచారం: యూఎస్ రిపోర్ట్..
అయితే, స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్, వండిపెరియార్- సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్ లో ఉన్నాయి. ఇక, నీలక్కల్‌లో కోటా ముందే ముగిసే అవకాశం ఉంది. దీంతో యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచనలు జారీ చేసింది. అయితే, శబరిమలకు బయలుదేరే ముందు అయ్యప్ప స్వామి భక్తులు పాసులను తమ దగ్గర పెట్టుకోవడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని వెల్లడించింది. నీలక్కల్, పంబా, సన్నిధానం దగ్గర భద్రతా ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, శబరిమలలో హెల్ప్‌లైన్: 14432 నెంబర్, ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చే భక్తులకు హెల్ప్ లైన్ నంబర్… 04735-14432..