Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు.