Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..

  • బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..
  • కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, ఎన్డీయే సీఎంలు..
Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రికార్డ్ స్థాయిలో ఆయన 10వ సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరింది. పాట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రలు అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతరులు హాజరయ్యారు. సీఎం నితీష్ కుమార్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టారు.

Read Also: Eric Trump: జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయ’’ ద్వేషి.. ట్రంప్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయ కూటమి భారీ విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లు, జీతన్ రమ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ, ఆర్ఎల్ఎం మిగిలిన స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.