Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రికార్డ్ స్థాయిలో ఆయన 10వ సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరింది. పాట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రలు అమిత్ షా హాజరయ్యారు.