దర్భంగా పేలుళ్ల కేసులో విచారణ ముమ్మరం చేసింది ఎన్‌ఐఏ.. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ బృందం బీహార్ వెళ్లింది. దర్భంగా రైల్వేస్టేషన్ చేరుకుని… విచారణ చేసింది. పార్శిల్ బ్లాస్టింగ్ కేసులో… ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది. వారు ఇచ్చిన సమాచారంతో… బ్లాస్టింగ్ ఉన్న వారి గుట్టును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది ఎన్‌ఐఏ.. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. ఐదుగురిని అరెస్ట్ చేసింది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. విధ్వంసం కుట్ర వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది.