Maharashtra: సీఎం పదవిపై వెనక్కి తగ్గిన షిండే వర్గం.. కారణమిదేనా?
- సీఎం పదవిపై వెనక్కి తగ్గిన షిండే వర్గం
- బీజేపీకి సొంతంగా 132 సీట్లు.. ఎన్సీపీ మద్దతు
- డిమాండ్ చేసేంత సీట్లు లేకపోవడంతో షిండే మౌనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. ఇక బీజేపీ అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి.. సంఖ్యాబలం కలిగి ఉంది. దీనికి ఎన్సీపీ కూడా మద్దతు తెలిపింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 132 అసెంబ్లీ స్థానాలను కమలనాథులు కైవసం చేసుకున్నారు. బీజేపీకి వచ్చిన సీట్లలో సగం మాత్రమే షిండేకు చెందిన శివసేనకు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై అంతగా నోరు మెదపడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Adani Group: అదానీకి మరో ఎదురు దెబ్బ.. భారీ ప్రకటన చేసిన ఫ్రెంచ్ దిగ్గజం
Also Read
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆదివారం శివసేన ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఫార్ములా అమలు చేయాలని కోరారు. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సంఖ్యాబలం లేకపోయినా.. ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. అదే తరహా సిద్ధాంతాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని షిండే వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Aamir Khan : సినిమాలకు స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వస్తి.. కానీ..?
ఇదిలా ఉంటే అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి 41 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించేశారు. దీంతో ఈజీగా శివసేన మద్దతు లేకుండా సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఈ నేపథ్యంలోనే షిండే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయడం లేదని.. మౌనంగా ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం డిప్యూటీ సీఎం పదవి తీసుకుని సరిపెట్టుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కే ఛాన్సుంది. ఇక దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. బీజేపీ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర సీఎం పదవిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41, ఉద్ధవ్ థాకరే పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ పార్టీకి 10, ఎస్పీకి 2, ఇతరులకు 10 సీట్లు వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ram Talluri : ‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది
తాజావార్తలు
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!