Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఎయిరిండియా హైజాక్ కలకలం
- జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఇంకా కారణాలు వెల్లడించని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం రేపింది. ఇటీవల ఫ్లైదుబాయ్, బ్రిటిష్ విమానాల మాదిరిగా ఎయిరిండియా నుంచి ఎమర్జెన్సీ కోడ్ స్క్వాక్ 7500 వెలువడింది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాన్ని రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
బుధవారం విమానం నుంచి వచ్చిన అలర్ట్‌ను అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం విమానాన్ని సురక్షితంగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని భద్రతా తనిఖీల కోసం ప్రత్యేక ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయితే విమానం నుంచి ఆ కోడ్ ఎందుకు ప్రసారమైంది? ఏదైనా సాంకేతిక సమస్య కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయాలపై వెంటనే స్పష్టత రాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు నివేదికలు తెలిపాయి.
Also Read
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
స్క్వాక్ 7500 అంటే ఏమిటి?
విమానయాన రంగంలో స్క్వాక్ 7500 అనేది హైజాక్ లేదా విమానంపై చట్టవిరుద్ధ జోక్యం జరిగినప్పుడు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు రహస్యంగా సమాచారం అందించేందుకు ఉపయోగించే అంతర్జాతీయ ట్రాన్స్‌పాండర్ కోడ్. ఈ కోడ్ ప్రసారమైనట్లు సమాచారం రావడంతో విమానంలో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే కోడ్ ప్రసారమైనంత మాత్రాన విమానం నిజంగానే హైజాక్‌కు గురైందని నిర్ధారించలేం. అసలు అలర్ట్‌కు కారణమేంటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇటీవల దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ కలకలం రేపింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడికి యత్నించి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించడంతో అనూహ్యంగా స్మిత్ కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు విమానాన్ని నియంత్రించారు. అనంతరం సేఫ్‌గా విమానం ల్యాండ్ చేశారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!