గంగానదిలో ఓ పెట్టె కొట్టుకు వచ్చింది. దానిని తెరిచి చూసి పడవనడిపే వ్యక్తి షాక్ అయ్యాడు. ఆందులో 21 రోజుల వయసున్న చిన్నారి, పక్కన కాళీమాత అమ్మవారి ఫొటో ఉన్నది. ఫొటో పక్కన చిన్నారి జాతకం, గంగ అనే పేరు ఉన్నది. గంగా మాత ప్రసాదించిన చిన్నారిగా భావించిన ఆ వ్యక్తి పెంచుకుందామని ఇంటికి తీసుకుపోయాడు. అయితే, విషయం అధికారులకు తెలియడంతో హుటాహుటిన పడవ నడిపే వ్యక్తి ఇంటికి వచ్చి చిన్నారిని పెంచుకోవడానికి కుదరదని, విచారణ జరపాలని చెప్పి బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రిఘాట్ వద్ద జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.