Site icon NTV Telugu

PM Modi: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్.. మోడీకి ఎంపీల సన్మానం

Modi5

Modi5

భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం రాత్రి ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. అనంతరం భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించినట్లైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌కు కూడా మంచి ఊపునిచ్చింది. భారీ స్థాయిలో లాభాల్లో దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి: Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?

ఇక భారత్-యూఎస్ డీల్ కుదరడంతో మంగళవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలంతా ఘనంగా సన్మానించారు. మోడీ మెడలో పూలదండ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

వాణిజ్య ఒప్పందం భారతదేశ ఆర్థిక బలం, దౌత్య నైపుణ్యం, ప్రపంచ ప్రభావానికి నిదర్శనమని మోడీ అన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘దేశంలో తయారీని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ప్రస్తుత కాలంలో అతిపెద్ద డిమాండ్. దేశం ఇప్పుడు ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ నాణ్యతను ప్రపంచానికి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు

ఇక ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి బడ్జెట్ విజయాలు, ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని మోడీ ఆదేశించారు. బడ్జెట్ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వారి జీవితాలకు.. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ చర్యల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొ్న్నారు. ఇక పార్లమెంటులో క్రమశిక్షణ, చురుకైన హాజరు ఉండాలని సూచించారు. ఎంపీలందరూ ప్రతిరోజూ సభలో హాజరు కావాలని.. చర్చలలో పూర్తిగా పాల్గొనాలని కోరారు. శాసన ప్రక్రియను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ఎంపీల బాధ్యత కూడా అని పేర్కొన్నారు.

Exit mobile version