Indian Navy: భారత నేవీ దెబ్బకు మరోసారి సముద్ర దొంగల ప్రయత్నం విఫలమైంది. సోమాలియా తూర్పు తీరం వెంబడి మరో పైరసీ ప్రయత్నాన్ని అడ్డుకుంది. జనవరి 31న ఎంవీ ఒమారీ అనే ఇరానియన్ ఫ్లాగ్డ్ కలిగి ఉన్న ఫిషింగ్ నౌకపై ఏడుగురు సముద్ర దొంగల దాడిని నిలువరించి పాకిస్తాన్, ఇరాన్ సిబ్బంది రక్షించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.