Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ
- అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి నవనీత్ కౌర్ లేఖ
- ఇటీవల పార్లమెంట్‌లో జై పాలస్తీనా అంటూ నినాదం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయా ఎంపీలు రకరకాలైన స్లోగన్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ మాత్రం.. ప్రమాణస్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. ఈ ఘటన సభలో దుమారం రేపింది. రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
తాజాగా అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు. ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MP Airport: కూలిన టెర్మినల్ పైకప్పు.. కారు ధ్వంసం.. తప్పిన ప్రాణాపాయం
జూన్ 25వ తేదీన అసదుద్దీన్ పార్లమెంట్‌లో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో అసదుద్దీన్ ఒవైసీ.. జై బీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందించారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాజాగా నవనీత్ కౌర్.. రాష్ట్రపతికి లేఖ రాసి సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరారు.
ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా అసదుద్దీన్‌పై నవనీత్ కౌర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా కూడా ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత తరపున ఆమె ప్రచారం చేశారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!