పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయా ఎంపీలు రకరకాలైన స్లోగన్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ మాత్రం.. ప్రమాణస్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది.