AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్ NTR వైద్య సేవ పథకంలో అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులపై ప్రభుత్వం, వైద్య సేవల ట్రస్ట్ కఠిన చర్యలు తీసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2026–27 వరకు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 203 నెట్వర్క్ ఆసుపత్రులపై మొత్తంగా రూ.34.39 కోట్ల మేర భారీ జరిమానాలు విధించారు. వైద్య సేవల్లో తీవ్రమైన లోపాలు చూపడం, అనుమానాస్పద బిల్లులు దాఖలు చేయడం, రోగుల వద్ద ఉచిత వైద్యానికి అదనపు నిధులు వసూలు చేయడం.. అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడినందుకు గాను ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
అక్రమాల తీవ్రతను బట్టి చర్యలు చేపడుతూ 25 ఆస్పత్రుల సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేయగా, 13 ఆస్పత్రులకు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. మరో 5 ఆస్పత్రులను నెట్వర్క్ జాబితా నుంచే శాశ్వతంగా తొలగించగా, తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఇంకో ఆసుపత్రి గుర్తింపును పూర్తిగా రద్దు చేశారు. ఒక్క గడచిన ఆరు నెలల వ్యవధిలోనే 114 కేసులను విచారించి కఠిన నిర్ణయాలు అమలు చేశారు. పేదల కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తోంది.
Also Read
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు NTR వైద్య సేవల ట్రస్ట్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా కల్తీ, నకిలీ , అనుమానాస్పద బిల్లులను త్వరితగతిన గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రోజుకు వచ్చే దాదాపు 6,000 ముందస్తు వైద్య అనుమతి (ప్రీ-ఆథరైజేషన్) అభ్యర్థనలను రెండు దశల్లోనూ, రోజుకు సమర్పించే 5,600 చికిత్సల బిల్లులను నాలుగు దశల సుదీర్ఘ పరిశీలన ద్వారా తనిఖీ చేస్తున్నారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆసుపత్రులపై చర్యలు చేపడుతున్నారు.
బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వారి వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉచిత సేవలు అందించాల్సిన చోట రోగుల వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే సదరు రుసుమును బాధితులకు తిరిగి ఇప్పించడంతో పాటు ఆ మొత్తానికి మూడు రెట్ల జరిమానాను ఆసుపత్రులపై విధిస్తున్నారు. పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి నిజమైన బిల్లులకు చెల్లింపులు త్వరగా పూర్తి చేస్తూనే, అక్రమాలకు తావులేకుండా యంత్రాంగం నిఘా పెంచింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ సీఈఓ పద్మావతి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేశారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!