OM Birla : ఇప్పుడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్లమెంటు సభ్యులెవరూ నినాదాలు చేయలేరు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో 'జై పాలస్తీనా', 'జై హిందూ రాష్ట్ర' అంటూ నినాదాలు చేశారు.
పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయా ఎంపీలు రకరకాలైన స్లోగన్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ మాత్రం.. ప్రమాణస్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు