తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్.. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్, ఆయనకు కాబోయే భార్య శ్రావ్య వర్మలు సీఎంకు శుఖలేఖను అందజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 2018లో పద్మశ్రీ అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు సైతం అతడికి దక్కింది. కెరీర్ ఆరంభంలో అనూహ్య…
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు (అంటే 12 రోజుల పాటు) జరగనున్నాయి. ఈ పోటీల్లోని 6 ఈవెంట్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస జగన్‌తో బ్యాడ్మింటన్ ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ భేటీ అయ్యారు. నేడు ఉదయం సచివాలయానికి వచ్చిన కిడాంబి శ్రీకాంత్‌తో సీఎం జగన్ చర్చించారు. అయితే.. శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నేతృత్వంలో సీఎం జగన్ తో కిడాంబి భేటీ అయ్యారు. అయితే.. తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో కిడాంబి శ్రీకాంత్ పాల్గొన్నారు.…
ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే ఊహించని పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-23, 10-21తో 41వ ర్యాంకర్ బ్రైస్ లెవెర్‌దెజ్ (ఫ్రాన్స్) చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు. గతంలో లెవెర్‌డెజ్‌తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. 42 నిమిషాల్లో…
థామస్ కప్, ఉబెర్ కప్ గెలిచిన బ్యాట్మింటన్ టీమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇండియాకు ‘ ఎస్ మనం దీన్ని చేయగలం ’ అనే వైఖరి శక్తిగా మారిందని ప్రధాని నరేంద్ మోదీ అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. మొత్తం దేశం తరుపున జట్టును అభినందిస్తున్నానని మోదీ అన్నారు. థామస్, ఉబెర్ కప్ ను గెలవడం చిన్న విషయం కాదని ప్రధాని మోదీ…
భారత షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ ‘థామస్ కప్’ గెలిచి చరిత్ర సృష్టించడంతో.. అమలాపురంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విజయం సాధించిన భారత టీమ్‌లో అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఉండడంతో.. అమలాపురం పట్టణంలో అభిమానులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విజయోత్సవం నిర్వహించారు. కాగా.. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. టోర్నీ…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని శ్రీకాంత్ సాధించారు. Read Also:గుడ్‌న్యూస్: ఆ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ… ఈ నేపథ్యంలోనే…