Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nana Patole Quits As Maharashtra Congress Chief

Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా

Published Date :November 25, 2024 , 12:00 pm
By Chandra Shekhar Pamena
  • మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేసిన నానా పటేల్..
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా..
  • 101 స్థానాల్లో పోటీ కేవలం 16 సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ..
Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్‌ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు. అయితే, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచింది. అటు ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి 51 చోట్ల విజయం సాధిచింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ లేనంత బలహీనంగా హస్తం పార్టీ మారిపోయింది.

Read Also: Gold Price Today: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?

ఇక, 2014లో కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోడీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తీవ్రంగా నష్ట పోయింది. అప్పట్లో కేవలం 42 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కోలుకోలేదు. తాజా ఎన్నికల్లో కనీసం 25 స్థానాలు కూడా సాధించలేకపోయింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం.. తదితర అంశాలతో పార్టీ ప్రజాదరణను కోల్పోతోందని రాజకీయ నిపుణులు తమ అభిప్రాయం వెల్లడించారు. అయితే, 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో విజయం సాధించి.. అద్భుతమైన ప్రదర్శన చూపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Maharashtra Elections
  • mva
  • Nana patole

తాజావార్తలు

  • India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్‌ చరిత్ర..!

  • UBS : పవన్‌కు పోలీస్ క్యారెక్టర్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?

  • Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ

  • Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ లాంచింగ్ ఈ రోజే.. ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే..

  • Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions